ఇల్లు వాకిలి వదిలి వెళ్లిన ఎంతో మంది కథల్ని చదివాను, రోమాలు నిక్కపొడుచుకునేవి. అలాంటి ఒక రోజు నా జీవితంలో కూడా వచ్చింది. అది ఈ రోజే August 6, 2026. రోమాలు నిక్కపొడుచుకోలేదు, కళ్లల్లో నీళ్లు తిరిగాయి, తిరుగుతూనే ఉన్నాయి. దారి పొడవునా కన్నీళ్లే, "మళ్లీ మా అమ్మను చూస్తానో లేదో, నా తమ్ముడు, అక్క, వారి పిల్లలు, వాళ్ళ విజయాల్ని చూస్తానో లేదో, చరమాంకంలో ఉన్న నా పప్పీని (My pet dog) చూస్తానో లేదో, నాకెంతో ఇష్టమైన నా మోటార్‌సైకిల్ రైడింగ్ చేయలేనేమో, నా స్నేహితులు..." ఇవన్నీ మనసును సుడిగుండంలా చుట్టేస్తున్నాయి. ఆత్మహత్య అయితే చేసుకోవట్లేదు. శ్రీలంక లో బౌద్ధ సన్యాసిని కాబోతున్నాను. కొన్ని దశాబ్దాల క్రితం తమ్ముడు ఇంటర్మీడియట్ తిరుపతిలో చదువుతున్నప్పుడు తనని చూడడానికి వెళ్లొస్తున్నప్పుడు కలిగిన బాధ లాంటి బాధ, గుండెల్ని పిండేసే బాధ. కొన్ని ప్రయాణాలు చాలా బాధిస్తాయి, కానీ తప్పదు. ఎన్నో సార్లు ఇంటి నుండి బయలుదేరాను, కొన్నిసార్లు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇంటి మొహం చూడకుండా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి, అయినా ఈ ప్రయాణం నన్ను, నా లోకాన్ని, నన్ను ప్రేమించే వాళ్ళని ఎంతగానో బాధిస్తోం...
ఒక పెద్దాయన అన్నాడు "మూర్ఖులు ఇల్లు కడతారు, తెలివైన వాళ్ళు అందులో నివాసం వుంటారు" అని. నీ దగ్గర లేని 50 లక్చలు పెట్టి ఆ ఇల్లు కొనే బదులు. అదే డబ్బు పొదుపు చేసుకొని మంచి పథకం లో పెట్టుబడి పెట్టుకుంటే 40 వేల దాకా వస్తుంది. ఒక పది వేలకు ఒక మంచి ఇంట్లో అద్దెకు వుండి. మిగిలిన డబ్బుతో కుటుంబం అంతా ఒక విలాసవంతైన జీవితాన్ని గడపోచ్చు. 6 నెలలకు ఒక సారి దేశ విదేశ యాత్రలకు కూడా వెళ్లొచ్చు (http://www.yhaindia.org/). రోజూ బడికి ప్రమాదకరమైన రహదారుల్లో బైక్ మీద వెళ్ళడం కంటే కార్ లో వెళ్ళడం ఎంతో వుత్తమం. నువ్వు లేని ఎంత మంచి ఇళ్లైన, నీ పిల్లలకు, నీ అర్థాంగికి ఏం ప్రయోజనం? చాలీ చాలని బతుకులు బతికింది ఇక చాలు. అందరిలాగా లేని డబ్బుతో ఆస్తులు కూడగట్టుకునే క్రమంలో నువ్వు ఏం కోల్పోవడానికి సిద్దమయ్యావో నీకు తెలియట్లేదు. EMI (నెలసరి కంతులు) లో నీ జీవితాన్ని తాకట్టు పెట్టొద్దు. మీ నాన్న నీకు ఏం ఆస్తులు మిగిల్చి వెళ్ళాడు? మీరు నెగ్గుకు రాలా? కని, పెంచిన పిల్లల పై, వారి సామర్థ్యం పై నమ్మకం లేని తల్లిదండ్రులే ఇలా వెంపర్లాడేది. పిల్లల భవిష్యత్తు కోసం ఆరాట పడుతున్నాం అన...