ఇల్లు వాకిలి వదిలి వెళ్లిన ఎంతో మంది కథల్ని చదివాను, రోమాలు నిక్కపొడుచుకునేవి. అలాంటి ఒక రోజు నా జీవితంలో కూడా వచ్చింది. అది ఈ రోజే August 6, 2026. రోమాలు నిక్కపొడుచుకోలేదు, కళ్లల్లో నీళ్లు తిరిగాయి, తిరుగుతూనే ఉన్నాయి. దారి పొడవునా కన్నీళ్లే, "మళ్లీ మా అమ్మను చూస్తానో లేదో, నా తమ్ముడు, అక్క, వారి పిల్లలు, వాళ్ళ విజయాల్ని చూస్తానో లేదో, చరమాంకంలో ఉన్న నా పప్పీని (My pet dog) చూస్తానో లేదో, నాకెంతో ఇష్టమైన నా మోటార్‌సైకిల్ రైడింగ్ చేయలేనేమో, నా స్నేహితులు..." ఇవన్నీ మనసును సుడిగుండంలా చుట్టేస్తున్నాయి. ఆత్మహత్య అయితే చేసుకోవట్లేదు. శ్రీలంక లో బౌద్ధ సన్యాసిని కాబోతున్నాను. కొన్ని దశాబ్దాల క్రితం తమ్ముడు ఇంటర్మీడియట్ తిరుపతిలో చదువుతున్నప్పుడు తనని చూడడానికి వెళ్లొస్తున్నప్పుడు కలిగిన బాధ లాంటి బాధ, గుండెల్ని పిండేసే బాధ. కొన్ని ప్రయాణాలు చాలా బాధిస్తాయి, కానీ తప్పదు. ఎన్నో సార్లు ఇంటి నుండి బయలుదేరాను, కొన్నిసార్లు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇంటి మొహం చూడకుండా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి, అయినా ఈ ప్రయాణం నన్ను, నా లోకాన్ని, నన్ను ప్రేమించే వాళ్ళని ఎంతగానో బాధిస్తోం...
It's all about real life as it happened or as it is perceived... (The journey of being a soldier to Marketing Executive, from being a farmer to a Call Center Employee and finally a yogi...)