నా మొబైల్ ఫోన్ ని దానం గా ఇచ్చేసే ముందు, కొన్ని సంఘటనల్ని, అనుభవాల్ని, ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టాలనే ఆలోచనతో...
నా ఈ ప్రయాణానికి బ్యాగ్ సర్దుతున్నప్పుడు, 'అరె ఏముంది సర్దడానికి' అనే ప్రశ్న? మళ్లీ అమ్మకు సందేహం రాకూడదని ఒక చిన్న Trolly Suitcase లో అవసరం లేకున్నా బట్టలు పెట్టుకున్నా. వాటిల్లో ఒక్కటి కూడా ఇప్పుడు వేసుకోవట్లేదు. మరి? ఎవరో దానంగా వదిలి వెళ్లిన చొక్కా, పంచె ఉతుక్కోని వేసుకుంటున్నా. ఎందుకంటే? Monk training లో తెల్లబట్టలు మాత్రమే వేసుకోవాలి. ఈ విషయం నాకు ముందే తెలియదు. సరే Trolley Suitcase విషయానికి వద్దాం, అందులోని సగం బట్టల్ని, నా మొదటి బస్ స్టాప్ లో వదిలి పెట్టేశా. మిగిలిన వాటిని ఇక్కడికి వచ్చాక...
ధైర్యం చేసి మా అమ్మకు నేను ఉద్యోగం కోసం మాల్దీవులకు వెళ్లలేదు, శ్రీలంకకు వచ్చానని చెప్పాను. అప్పుడు నమ్మలేదు, తర్వాత తమ్ముణ్ణి అడిగి ధృవీకరించుకుని, బాధపడుతోంది...
నా తమ్ముడి కొడుకు, కూతురు తో ఫోన్లో మాట్లాడినప్పుడు, "వాళ్లేన్నారు నీకేం కర్మ పట్టిందా సన్యాసి అవ్వడానికి" అని మళ్లీ నా సమాధానంతో సంతృప్తిచెందినట్లు అనిపించింది.
"ఒకే జీవితంలో సైనికుడి శిక్షణ, యోగా టీచర్ శిక్షణ, సన్యాసి శిక్షణ కుదరడం/దొరకడం సాధారణమైన విషయం కాదు కదా" అని నా సమాధానం. దానికి వాళ్లు ఒక సంవత్సరంలో తిరిగి వచ్చేయి అని చెప్పారు.
నా తమ్ముడితో నీలగిరి కొండలకి ఒక వారం సాహస యాత్ర, నా తమ్ముడి కొడుకుతో హిమాలయ కొండలకి ఒక వారం సాహసయాత్ర కి వెళ్లాను. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు. ఇంటి నుండి బయలుదేరితే 24 గంటలలోపు లేదా చీకటి పడక ముందే ఎన్ని అద్భుతమైన ప్రదేశాలు చేరుకోవచ్చు. వయనాడు కి వెళ్లినప్పుడు, కన్యాకుమారికి వెళ్లినప్పుడు, మున్నార్ కి వెళ్లినప్పుడు, చివరగా శ్రీలంక కు వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలెన్నో...
ప్రస్తుతానికి ఐతే, కేవలం అంతరయాత్ర మాత్రమే. శ్రీలంకకు స్వాగతం!! ఇక సోషల్ మీడియాలో చూడటం వల్ల, కొంతమంది నుండి వినడం వల్ల
Page3
బుద్ధిస్టు దేశం కదా అంతా ధర్మ బద్దంగా వుంటుంది అనుకోవడంలో అభిప్రాయంలో వున్నాను. Airport లో Bus ఎక్కి కొలంబో Port కి దిగి ముందు Fare ఎంత అని అడిగితే అతను ఫోన్ తీసి అందులో Type చేసి చూపించాడు. 760 LKR అని. అతనికి మాటలు రావేమో అనుకుని Pay చేసి, బస్సు దిగి 99 నంబరు బస్సు ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే Right Across the road అని నోటితో చెప్పాడు. అప్పుడు అర్థమయ్యింది. అతను నిజంగా ఎక్కువ డబ్బు తీసుకున్నాడని. తర్వాత దాహంగా వుండి Shop లో Water Bottle తీసుకున్నా 120 LKR, తొందరలో 200 ml నీళ్లు తాగాను. తర్వాత తెలిసింది ఆ బాటిల్ సీల్ ట్యాంపర్ అయ్యి వుందిగదాని. ఇలాంటి అనుభవాలు ఇంకెప్పుడైనా ఎదురయ్యుంటే ఎంత దోచుకుంటారో దోచుకోండి అనిపించింది. నేను ఈ డబ్బులు పొదుపు చేసుకోబోవట్లేదు, దీన్ని తాకడం కూడా వృధాయే కాషాయ బట్టలు వేసుకున్నాక అనిపించి నవ్వొచ్చింది, ఎప్పుడు ఎంత దోచుకుంటే ఏం అనిపిస్తుంది.
Comments
Post a Comment